మంచి విత్తనోత్పత్తి కొరకు నాట్లను దూర దూరముగా వేసుకోవడకోవడం, సమ తుల్యమయిన నేల, ముందు సంవత్సరం వరి వేయని లేదా అదే రకం వరి వేసిన భూములు ఎంచుకోవడం కీలకమైన అంశాలు. పరపరాగ సంపర్కం ద్వారా కల్తిలు లేకుండ ఉండటానికి వివిధ వరి రకాలను, దూర దూరంగా పండించాలి.
పైరు దుబ్బ చేసే సమయం, పూత , గింజ గట్టి పడే దశల్లో కల్తీ మొక్కలను ఏరి తీసివేయాలి. పొలంలో గట్టు ప్రక్కల చుట్టూ ఐదు మీటర్ల విస్తీర్ణం మేరకు వదలి, లోపలి పొలం నుండి విత్తనాన్ని సేకరించాలి. ఒక కల్తి మొక్కను వదిలి వేస్తె సుమారు వెయ్యి గింజలు రాబోయే పైరులో కేళిలుగా తయారవుతాయి.
సమతుల్యంగా ఎరువులు వాడటం వలన పోషక విలువలతో పాటు గింజ నాణ్యతను పెంపొందించవచ్చును. నత్రజని ఎరువులను పూత దశ నుండి ముందే వాడాలి. తర్వాత వాడితే ధాన్యంలో విరుగుళ్ళ శాతం పెరుగుతుంది. వరి పంట అంకురం దశ నుండి పక్వ దశ వరకు నిటి ఎద్దడి ఉండరాదు . లేకుంటే తాలు గింజలు, విరుగుళ్ళు ఏర్పడాతాయి. గింజ గట్టిపడే సమయంలో అంటే కోతకు 7-10 రోజులు ముందుగానే నీటిని తీసివేయాలి.